- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'విశ్వంబర' రిలీజ్ డేట్ లాక్
విశ్వంభర సినిమాని జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'విశ్వంభర' అనే సోషియో-ఫాంటసీ చిత్రాన్ని చాలా కాలం క్రితమే ప్రారంభించారు. ఈ సినిమాను తొలుత 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన పలు విడుదల తేదీలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, సినిమా మాత్రం విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు దాదాపు పూర్తయ్యాయని, దీంతో ఈ చిత్రాన్ని జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రారంభం నుంచి ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనుల కారణంగానే విడుదల పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. దీంతో రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.






