Vishnu Vinyasam : నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇవే

by Pulgam srinivas |

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన విష్ణు విన్యాసం చిత్రానికి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా 75k ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.

Vishnu Vinyasam : నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు హీరోగా రూపొందిన విష్ణు విన్యాసం చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ మధ్యకాలంలో ఈ నటుడు నటించిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉండడం, అలాగే విష్ణు విన్యాసం సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మొదటినుండి ఈ చిత్రంపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనడంతో ఈ మూవీకి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే మంచి కలెక్షన్లు దక్కాయి.

తాజాగా ఈ మూవీ యూనిట్ నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 75k ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈరోజు విడుదల అయిన ఈ సినిమాకు పర్వాలేదనే టాక్ దక్కింది. మరి ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించాడు.

మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ విష్ణు ఈ సినిమాతో పాటే మృత్యుంజయ్ అనే చిత్రంలో కూడా నటించాడు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. మొదట ఇదే తేదీన అనగా ఫిబ్రవరి 27వ తేదీన మృత్యుంజయ్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను మార్చి 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.




Next Story