శ్రీ విష్ణు "విష్ణు విన్యాసం" విడుదల తేదీ ఫిక్స్

by Pulgam srinivas |

విష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

శ్రీ విష్ణు విష్ణు విన్యాసం విడుదల తేదీ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈయన ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. హీరోగా కూడా ఇప్పటికే విష్ణు ఎన్నో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు విష్ణు విన్యాసం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించబోతుంది. యదునాద్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై జి సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.





ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని ఆసక్తి జనాల్లో బాగానే ఉంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఆఖరుగా శ్రీ విష్ణు స్వాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా శ్రీ విష్ణుకి నిరాశనే మిగిల్చింది.

Next Story