ప్రియుడితో కలిసి గిరి ప్రదక్షిణ చేసిన విరూపాక్ష బ్యూటీ.. ఫొటోలు వైరల్

by Kavitha |
ప్రియుడితో కలిసి గిరి ప్రదక్షిణ చేసిన విరూపాక్ష బ్యూటీ.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకున్న సోనియా సింగ్(Sonia Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీకు ‘రౌడీ బేబీ’, ‘హే పిల్ల’ యూట్యూబ్ చానల్స్ ద్వారా ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రేజ్‌తోనే ‘యమలీల’(Yamaleela) సీరియల్‌లోనూ నటించి మెప్పించింది. దీంతో సినిమాల్లో నటించే చాన్స్ కూడా వచ్చేసింది. అలా 2023లో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా నటించిన ‘విరూపాక్ష’(Virupaksha) మూవీలో సోనియా సింగ్ నటించి మెప్పించింది ఇక ఈ ముద్దుగుమ్మ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది.

అలాగే నితిన్(Nithin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్’ మూవీలోనూ ఓ కామెడీ రోల్‌తో ఆకట్టుకుంది. ఇక ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. పవన్ సిద్దూ అనే తన కో యాక్టర్‌తో ప్రేమలో పడింది.వీరిద్దరు కలిసి రీసెంట్‌గా శశి మథనం అనే ఓటీటీ సినిమా కూడా చేశారు. ఈ క్రమంలో వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సోనియా తన బాయ్ ఫ్రెండ్‌తో అరుణాచలేశ్వర్ వెళ్లింది. అక్కడ సిద్ధూ పవన్‌తో గిరి ప్రదక్షణ చేసి శివుడ్ని దర్శనం చేసుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed