- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరోష్ నాన్‌వెజ్ దావత్.. నెట్టింట తీవ్ర చర్చ.. కామెంట్ బాక్సుల్లో ఫ్యాన్స్ వార్
సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేసిన విరోష్ కపుల్.. నాన్ వెజ్ దావత్ ఇవ్వడంపై నెట్టింట చర్చకు దారితీసింది.

దిశ, వెబ్‌డెస్క్: గత నెల 26న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్న విజయ్ - రష్మిక దంపతులు సోమవారం సొంతూరికి విచ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటలో కొత్తగా కట్టుకున్న ఫామ్ హౌస్ లో సత్యనారాయణస్వామి వ్రతం చేసి, గృహప్రవేశం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన అతిథులు, అభిమానులు, గ్రామస్తులకు గ్రాండ్ గా దావత్ ఇచ్చారు. ఈ క్రమంలో భోజనంలో నాన్ వెజ్ వడ్డించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వగా.. వాటిపైనే విజయ్ హేటర్స్ - ఫ్యాన్స్ మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది.
సత్యనారాయణ స్వామి వ్రతం చేసి నాన్ వెజ్ పెట్టడం ఏంటంటూ.. కొందరు ఫైర్ అవుతున్నారు. పెళ్లి చేసుకుని అభిమానులకు దావత్ ఇస్తే అందులో తప్పేంటని ఫ్యాన్స్ సమర్ధిస్తున్నారు. ఆ జంట నాన్ వెజ్ తిన్నట్లు వీడియోలు, ఫొటోలేమైనా వచ్చాయా ? అక్కడికి వచ్చినవారికి విందు పెట్టారు అంతే కదా. ఇందులో తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సత్యనారాయణ వ్రతం చేసుకుని ఎవరూ ఇలా నాన్ వెజ్ తెలిసి పెట్టరని, ఇదేదో ఫేక్ వీడియోల్లాగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.






