Viral Vayyari Song: యూత్‌ను షేక్ చేసిన వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-04 06:18:20  IST  )

యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి(Kiriti) జంటగా నటించిన తాజా సినిమా ‘జూనియర్’(Junior).

Viral Vayyari Song: యూత్‌ను షేక్ చేసిన వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి(Kiriti) జంటగా నటించిన తాజా సినిమా ‘జూనియర్’(Junior). రాధాకృష్ణ రెడ్డి(Radhakrishna Reddy) దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న తెలుగు, కన్నడ భాషలలో విడుదలైంది. ఇక ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీలోని వైరల్ వయ్యారి సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలించింది.

అలా దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ఉత్సాహభరితమైన ట్యూన్స్‌కు కిరీటి, శ్రీలీల డ్యాన్స్‌ స్టెప్పులు పర్‌ఫెక్ట్ మాస్‌తో మేళవించడంతో ఈ సాంగ్ ప్ర‌త్యేక‌ ఆకర్షణగా మారింది. అంతేకాకుండా చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ఈ పాటలోని డ్యాన్స్‌ను రీక్రియేట్ చేశారు. అయితే ఇప్పటికే లిరికల్ వర్షన్‌ అభిమానుల్ని ఊపేసింది. ఇప్పుడు తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Next Story