భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ‘జననాయగన్’ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) త్వరలో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ‘జననాయగన్’ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) త్వరలో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆయన సినీ కెరీర్‌లో చివరి సినిమాగా ‘జననాయగన్’(Jananayagan) రాబోతుంది. హెచ్ వినోద్(H Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇందులో మమిత బైజు(Mamita Baiju), బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravichandran) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న.. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.120 కోట్లు కోనుగోలు చేయగా.. ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ హక్కులను కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు చెందిన సన్ నెట్ వర్క్ రూ. 55 కోట్లకు దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘జననాయగన్’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రోమియో పిక్చర్స్ రాహుల్ దాదాపు రూ. 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అది చూసిన నెటిజన్లు చివరి సినిమా కాబట్టి అంత ధర పలికాయని అంటున్నారు.

Next Story