విజయ్ అభిమానులు గుడ్ న్యూస్.. అస్సలు తగ్గేదే లేదు అన్నట్లుగా పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-11-06 15:14:41  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినీ కెరీర్‌లోనే చివరి సినిమాగా రాబోతోన్న చిత్రం ‘జన నాయగన్’.

విజయ్ అభిమానులు గుడ్ న్యూస్.. అస్సలు తగ్గేదే లేదు అన్నట్లుగా పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినీ కెరీర్‌లోనే చివరి సినిమాగా రాబోతోన్న చిత్రం ‘జన నాయగన్’. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, ప్రియమణి, శృతి హాసన్, బాబీ డియోల్, మోనిషా బ్లెస్సీ, జోసెఫ్ విజయ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నట్లు ఇప్పటికే టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.

కానీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీ ఎక్కువగా ఉండటం కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా అసలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లుగా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న రాబోతున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నవంబర్ 8 న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story