ఒకే సోఫాలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు..రొమాంటిక్ పిక్ !

by velandi.Saikiran |

విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఇద్దరూ ఒకే సోఫాలో కనిపించారు. యాష్ కలర్ ఉన్న సోఫాలో మొదట విజయ్ దేవరకొండ హాయిగా పడుకొని మెరిశాడు. మొబైల్ పట్టుకొని ఏదో వీడియోలో చూస్తూ విజయ్ కనిపించాడు. అచ్చం అలాంటి సోఫాలోనే రష్మిక కూడా విజయ్ తరహాలోనే ఫోజ్ ఇచ్చింది.

ఒకే సోఫాలో టాలీవుడ్ హీరో, హీరోయిన్లు..రొమాంటిక్ పిక్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న‌ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఈ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తొడిగిన రింగు మాత్రం రష్మిక చేతికి పెట్టుకుని మెరిశారు. ఆ రింగ్ చాలా స్పెషల్ అంటూ ఓ ఈవెంట్ లో కూడా వెల్లడించారు ర‌ష్మిక‌. ఎంగేజ్మెంట్ విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఇటలీకి వెకేషన్ కు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక వెళ్లిన సంగతి తెలిసిందే. రిటర్న్ లో శంషాబాద్ విమానాశ్రయంలో ఈ జంట‌ కలిసి కనిపించడంతో ఈ విషయం బయటపడింది.

ఒకే సోఫాలో విజయ్ దేవరకొండ, రష్మిక ?

విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఇద్దరూ ఒకే సోఫాలో కనిపించారు. యాష్ కలర్ ఉన్న సోఫాలో మొదట విజయ్ దేవరకొండ హాయిగా పడుకొని మెరిశాడు. మొబైల్ పట్టుకొని ఏదో వీడియోలో చూస్తూ విజయ్ కనిపించాడు. అచ్చం అలాంటి సోఫాలోనే రష్మిక కూడా విజయ్ తరహాలోనే ఫోజ్ ఇచ్చింది. దీంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఇద్దరు ఉన్న‌ట్లు దిగిన‌ట్లు చెబుతున్నారు. ఈ రెండు ఫోటోలు ఆధారంగా త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుందని కూడా అంచనా వేస్తున్నారు నెటిజెన్స్‌. కాగా ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన విజ‌య్, ర‌ష్మిక వివాహం జ‌రుగ‌నుంద‌ట‌. క్లిక్

Next Story