- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా ‘ప్రతిఘటన’కు 40 ఏళ్లు.. విజయశాంతి ట్వీట్ వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు విజయశాంతి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు విజయశాంతి. 30 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో 180కి పైగా సినిమాల్లో నటించి నేటితరం హీరోయిన్లకు స్ఫూర్తిదాయకంగా మారారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించిన విజయశాంతి.. హీరోలతో సమానంగా 1990లోనే కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటినటిగా గుర్తింపుపొందింది. నేటి భారతం ప్రతిఘటన, కర్తవ్యం ఆమె జీవితంలో మరిచిపోలేని చిత్రాలుగా నిలిచాయి. ప్రతిఘటన మూవీకి ఉత్తమ నటిగా నంది అవార్డును సైతం పొందారు ఆమె. లేడీ అమితాబ్‌గా పేరొందిన విజయశాంతికి ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలు, ఆరుసార్లు ఉత్తమ నటి పురస్కారాలు, దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాలు వరించాయి. కర్తవ్యం సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా నిలిచింది. చిరంజీవితో నటించిన ‘స్వయంకృషి’, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన ‘పడమటి సంధ్యారాగం’ సినిమాలు మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడం ఈ లేడీ బాస్ చరిత్రలో సువర్ణ అధ్యాయనంగా నిలిచిపోయాయి. ఇక ఏ సినిమాలో అయినా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే విజయశాంతి తన క్యారెక్టర్‌కు 100 శాతం న్యాయం చేస్తుందని దర్శకులు, నిర్మాతలు నమ్మేవారు.
నాలుగు దశాబ్దాల నాటి చిత్రాన్ని ఈ రోజు విజయశాంతి గుర్తు చేసుకున్నారు. ఎక్స్ (X) వేదికగా విజయశాంతి ట్వీట్ చేశారు. 1985 అక్టోబర్ 11 ‘ప్రతిఘటన’ చిత్రం విడుదల అయిందని విజయశాంతి గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం అని రాసుకొచ్చారు. నన్ను సూపర్ స్టార్‌గా నిలబెట్టి, అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్‌గా ‘ప్రతిఘటన’ నిలిచిందని చెప్పుకొచ్చారు. నంది అవార్డును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని స్మరించుకుంటూ ఆ చిత్ర దర్శకులు టీ.కృష్ణ, నిర్మాత రామోజీరావు, ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ అద్భుతమైన పాటను అందించిన వేటూరికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావుకు, సహ నటి నటులకు, సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతిఘటన చిత్రంలోని పాటలు, మాటలు, విజయశాంతి నటనను నెటిజన్స్ గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.






