- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. నెట్టింట సెన్సేషనల్ ఫొటోస్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma)తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(Vijay Varma)తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఫుల్లుగా తిరిగేశారు. తీరా మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు అనే క్రమంలో ఈ జంటకు బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గత కొద్దిరోజుల నుంచి విజయ్ ‘దంగల్’(Dangal) బ్యూటీ ఫాతిమా సనా షేక్(Fathima Sana shaik)తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆమెతో అతను చాలా క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ కావడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది.
ఈ క్రమంలో నెట్టింట ఓ సెన్సేషనల్ ఫొటో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. వైరల్ అవుతున్న ఫొటోస్‌లో ఫాతిమా సనా షేక్ అండ్ తమన్నా భాటియా చాలాక్లోజ్‌గా కనిపించారు. అయితే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరు కలిసి ఈ పిక్స్‌కు పోజులిచ్చారు. ఫాతిమా.. తమన్నా మాజీ లవర్ విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ఇలా కనిపించడంతో ఈ ఫొటోస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.






