- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay - Trisha: ఓకే పెళ్లిలో సందడి చేసిన విజయ్-త్రిష
ఓకే పెళ్లిలో సందడి చేసిన దళపతి విజయ్ - త్రిష

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో గత కొద్ది కాలంగా దళపతి విజయ్ సంచలనంగా మారారు. ఆయన కొంతకాలం క్రితం వరకు సైలెంట్గా సినిమాలు చేస్తూ వెళ్ళాడు. ఆయన సినిమాల విడుదలకు ముందు మాత్రమే పెద్ద ఎత్తున ఆయన గురించి వార్తలు వచ్చేవి. సినిమాలు లేని సమయంలో విజయ్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ జీవితాన్ని ఎంతో ఆనందంగా ముందుకు సాగించేవారు. కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి ఈ నటుడికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయటకు రావడం మొదలయ్యాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు రావడం మొదలయ్యాయి.
కొన్ని రోజుల క్రితమే విజయ్ భార్య, తన నుండి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నట్లు, ఎంత చెప్పినా ఆమెతో చనువుగా ఉండడం మానడం లేదని, అందుకే తననుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, తనని ఎవరైనా బాధపెడితే ఆ అమ్మాయి పేరు కూడా బయట పెడతానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ కూడా పెద్దగా బయట కనిపించలేదు. విజయ్ తాజాగా కళాపతి సురేష్, మీనాక్షి సురేష్ కుమారుని పెళ్ళికి విచ్చేశారు. ఈ వెడ్డింగ్ కి కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా వచ్చింది.
వీరిద్దరూ కలిసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దీనితో చాలా మంది విజయ్ - త్రిష ప్రేమలో ఉన్నారు అని, వీరిద్దరి ప్రేమని భరించలేక విజయ్ భార్య తనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కొంతమంది మొదటి నుండి అభిప్రాయపడుతూ వస్తున్నారు. ఇక విజయ్ భార్య తాజాగా తన నుండి విడాకులు కోరినట్లు ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే పెళ్లి వేడుకలో సందడి చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.






