మలేసియా పర్యటనలో విజయ్.. టీవీకే నినాదాలు వద్దన్న హీరో

by Naga Rani Yarlagadda |

ప్రముఖ తమిళ హీరో, దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా జననాయగన్ 2026 సంక్రాంతికి..

మలేసియా పర్యటనలో విజయ్.. టీవీకే నినాదాలు వద్దన్న హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ హీరో, దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా జననాయగన్ 2026 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను మలేసియా రాజధాని కౌలాలంపూర్లో నిర్వహించగా.. ఈ వేడుకకు విజయ్ హాజరయ్యారు. స్టేజీపై విజయ్ ను చూసిన అభిమానులు టీవీకే.. టీవీకే అంటూ నినాదాలు చేశారు. దాంతో విజయ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రాజకీయపరమైన నినానాదాలు, వ్యాఖ్యలు చేయవద్దని వారించారు. ఈ వేడుకలో ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని ముందే ఆంక్షలున్న క్రమంలో.. అభిమానులను చేతిసైగతో వారించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయపరమైన వ్యాఖ్యలే కాదు.. టీవీకే జెండా రంగులతో ఉండే వస్తువులకు కూడా అక్కడి పోలీసులు అనుమతివ్వలేదు. కాగా.. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ చివరిగా నటించిన సినిమా జననాయగన్ కావడంతో.. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Next Story