- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Sethupathi: గొప్ప మనసు చాటుకున్న విజయ్ సేతుపతి.. సినీ కార్మికుల కోసం భారీ విరాళం
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోగా మారాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ , హిందీ చిత్రాల్లో నటించి వెర్సటైల్ యాక్టింగ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారనడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాది విడుదలై-2, మహారాజ్(Maharaj) సినిమాలతో వచ్చి బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్స్ సాధించారు. అలాగే విలన్‌గా కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కృతిక ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా, విజయ్ సేతుపతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన సినీ కార్మికుల కోసం భారీ విరాళం అందజేసినట్లు సమచారం. విజయ్ సేతుపతి యూనియన్‌కు రూ.1.30 కోట్లు ఇచ్చారు. దీనిని కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నారు. మక్కల్ సెల్వన్ అందించిన సాయానికి గుర్తుగా ఈ అపార్ట్‌మెంట్‌కు విజయ్ సేతుపతి పేరు కూడా పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు విజయ్ సేతుపతి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వావ్, సూపర్ మీరు దేవుడయ్యా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కనీసం ఏడాదికి ఒక్క చిత్రంలో అయినా ఏదో ఒక పాత్రలో నటించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లోనూ భాగం అయి ఇలా సాయం చేస్తుండటం విశేషం.
Makkal Selvan for a reason! ❤️@VijaySethuOffl donates ₹1.30 Cr to the #FEFSI Movie Workers Union for building houses! 🏡👏 In honor of his generosity, the tower will be named "Vijay Sethupathi Tower."
— SIVA SK ᴴʸᴾᴱᴰ ᶠᴼᴿ ᴬᶜᴱ ᴬᴺᴰ ᵀᴿᴬᴵᴺ (@SIVA_SK_SK_07) February 22, 2025
A real hero on and off the screen! 🔥 #VijaySethupathi #MakkalSelvan pic.twitter.com/nBs6MTn15r






