- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Sethupathi : క్రిస్మస్ స్పెషల్‌గా విజయ్‌పూరీ మూవీ..
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి త్వరలో ‘సార్.. మేడం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి త్వరలో ‘సార్.. మేడం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. పాండిరాజ్(Pandiraj) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యజ్యోతి, త్యాగరాజన్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య జులై 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. అనౌన్స్‌మెంట్ నుంచే విజయ్‌పూరీ కలయికపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అలాగే ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్‌తో పాటు మరో అగ్ర నిర్మాత JB నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సంయుక్త, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. లేటెస్ట్‌గా ఈ మూవీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అంతే కాకుండా.. త్వరలో ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తమిళ్ వర్గాల నుంచి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లింక్






