- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు బెడ్ పై పడుకుంటారా ? విజయ్ సేతుపతి బోల్డ్ కామెంట్స్ !
విజయ్ సేతుపతి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మీరు బెడ్ పైన పడుకుంటారా ? అంటూ హీరోయిన్ ఆండ్రియా జర్మియా

దిశ, వెబ్ డెస్క్: విజయ్ సేతుపతి ( Vijay Sethupathi).. ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ స్టార్ హీరో అయినప్పటికీ మన తెలుగులో కూడా విజయ్ సేతుపతి రాణిస్తున్నారు. విలన్ నుంచి హీరో స్థాయి వరకు అన్ని పాత్రలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. అయితే అలాంటి విజయ్ సేతుపతి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మీరు బెడ్ పైన పడుకుంటారా ? అంటూ హీరోయిన్ ఆండ్రియా జర్మియా ( Andrea Jeremiah)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆండ్రియా నటించిన మాస్క్ సినిమా ఈ నెల చివరలో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరగగా, ఇందులో పాల్గొన్న విజయ్ సేతుపతి మాట్లాడారు. హీరోయిన్ ఆండ్రియాను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. తాను చిన్నతనంలో బీచ్ లో ఓ విగ్రహాన్ని చూశానని, ఆ తర్వాత ఆండ్రియాను చూసినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు ఇప్పటికీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయని ప్రశంసించారు. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని కామెంట్ చేశారు. నా కొడుకు కూడా మిమ్మల్ని చూసి వావ్ అంటున్నాడని గుర్తు చేశారు. మీరు బెడ్ పైన పడుకుంటారా? ఫ్రిడ్జ్ లో పడుకుంటారా ? అంటూ విజయ్ సేతుపతి కామెంట్ చేశారు. దీంతో అక్కడే ఉన్న ఆండ్రియా తెగ నవ్వేశారు. అటు విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.






