ఎవరు ఊహించని దర్శకుడితో విజయ్ మూవీ

by Pulgam srinivas |

బేబీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎవరు ఊహించని దర్శకుడితో విజయ్ మూవీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రణబాలి, అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సాయి రాజేష్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బేబీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ ఇప్పటికే విజయ్‌కు ఓ కథ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ చివరిగా నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ప్రస్తుతం తెరకెక్కుతున్న రణబాలి, రౌడీ జనార్ధన చిత్రాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు సాయి రాజేష్‌తో సినిమా కూడా ఫైనల్ అయితే విజయ్ లైనప్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

Next Story