కిస్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..క‌న్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ !

by velandi.Saikiran |

రష్మిక చేతిపైన కిస్ ఇచ్చి, తన ప్రేమను చాటుకున్నారు విజయ్.

కిస్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..క‌న్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారు ఉండరు. అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ తాజాగా చేసిన పని హాట్ టాపిక్ అయింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ( The Girlfriend Movie ) సక్సెస్ మీట్ సందర్భంగా హీరోయిన్ రష్మికకు ( Rashmika Mandanna) ముద్దు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ). ఈ సక్సెస్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన రష్మిక చేతిపైన కిస్ ఇచ్చి, తన ప్రేమను చాటుకున్నారు విజయ్.

దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారాయి. ఇంకేముంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని అభిమానులు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ జరిగిన వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే రాజస్థాన్ లో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. ఇక ఇదే ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలోని సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో ఎమోషనల్ అయ్యారు ర‌ష్మిక. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కాగా రాహుల్ రవీంద్రన్ ( Rahul Ravindran) తీసిన‌ ఈ సినిమా ఈ నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి కలెక్షన్స్ రాబడుతోంది. క్లిక్

Next Story