స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదల వాయిదా

by Ajay Maddhiboyina |

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన జ‌న నాయ‌గ‌న్ సినిమా ఓవ‌ర్సీస్ లో వాయిదా ప‌డింది. ఆ మేర‌కు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ ఆర్‌ఎఫ్‌టీ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.

స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదల వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన జ‌న నాయ‌గ‌న్ సినిమా ఓవ‌ర్సీస్ లో వాయిదా ప‌డింది. ఆ మేర‌కు ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ ఆర్‌ఎఫ్‌టీ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే చెన్నైలోనూ బుక్ మై షో నుండి జననాయగన్ సినిమాను తొలగించారు. దింతో తమిళనాట సైతం సినిమా విడుదల వాయిదా పడినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ తమిళనాట వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే జననాయగన్ సినిమా ఈ నెల 9న విడుదలకావాల్సి ఉంది. కానీ సినిమాను సెన్సార్ కష్టాలు వెంటాడుతున్నాయి.

జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు సెన్సార్ బోర్డ్ ఈ సినిమా మతపరమైన మనోభావాలు దెబ్బతీసిందని, సాయిధ దళాలను అభ్యంతకర రీతిలో చూపించారని అందుకే సర్టిఫికెట్ నిలిపివేసినట్టు ఆరోపిస్తోంది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 9కి వాయిదా వేసింది. కోర్టు తీర్పు రాకపోవడంతో సినిమా విడుదల సైతం వాయిదాపడింది. అయితే సినిమా విడుదల రాజకీయ కుట్రనే అని విజయ్ అభిమానులు, టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story