విజయ్ కొత్త సినిమా "రౌడీ జనార్ధన్" షురూ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-11 05:47:08  IST  )

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా రౌడీ జనార్దన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. దిల్ రాజు ఆఫీస్‌లో నేడు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోల దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్ కొత్త సినిమా రౌడీ జనార్ధన్ షురూ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా రౌడీ జనార్దన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. దిల్ రాజు ఆఫీస్‌లో నేడు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా క్రిస్టో క్సేవియర్ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే విజ‌య్ చివ‌ర‌గా కింగ్ డ‌మ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీనికి ముందు వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇక ఫ్యామిలీ స్టార్ కంటే ముందు వ‌చ్చిన ఖుషి సినిమా కూడా యావ‌రేజ్ టాక్ నే సంపాదించుకుంది. ఇక లైగ‌ర్ పాన్ ఇండియా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కూడా దిల్ రాజునే నిర్మాతగా వ్యహరించగా ఇప్పుడు వీరిద్దరి కాంబోలోనే రౌడీ జనార్దన్ వస్తోంది. మరి ఈ సినిమా అయినా ఆశించిన రౌడీ హీరోకు విజయాన్ని ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

Next Story