‘ఆ అవకాశం మళ్లీ వస్తే.. ఈసారి గూబ పగులగొట్టి చూపిస్తా’.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కీలక వ్యా్ఖ్యలు చేశారు. తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న రెట్రో మూవీ(Retro Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది.

‘ఆ అవకాశం మళ్లీ వస్తే.. ఈసారి గూబ పగులగొట్టి చూపిస్తా’.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కీలక వ్యా్ఖ్యలు చేశారు. తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న రెట్రో మూవీ(Retro Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ క్రమంలో యాంకర్ సుమ.. సూర్య(Suriya), విజయ్ దేవరకొండను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు. టైమ్ మిషన్‌లో భాగంగా మీకు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే.. ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? అని అడిగింది.

దానికి విజయ్ స్పందిస్తూ.. ‘బ్రిటీష్ వారు ఇండియాను పాలించే రోజులకు వెళ్లాలని ఉంది.. ఒక్కో బ్రిటీషు అధికారిని చెంప పగులగొట్టాలని ఉంది. అంతేకాదు.. ఛావా మూవీ చూసాక ఔరంగజేబు పాలించిన రోజులకు వెళ్లి.. వాడ్ని కూడా తన్నాలని ఉంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు హీరో సూర్య స్పందిస్తూ.. చిన్ననాటి రోజులకు వెళ్లాలని ఉంది. మళ్లీ ఆరోజులను ఆస్వాదించాలని కోరుకుంటాను అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెట్రో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, జయరాం, నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్‌గా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా మూవీ టీం వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ని పూర్తి చేసుకుని ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.


Next Story