- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పాకిస్తాన్ కొడుకులకు కామన్ సెన్స్ లేదు’.. ఉగ్రదాడిపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ(Retro Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..
‘ఆ పాకిస్తానీ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ పనికిమాలిన దాడలకు దిగేవారు కాదు. ఎవడెంత హడావిడి చేసినా డోంట్ కేర్.. కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనోళ్లే. రెండేళ్ల క్రితం ఖుషీ మూవీ షూటింగ్ అక్కడే చేశాను. కశ్మీర్‌తో నాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రజల ప్రేమను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. పాకిస్తాన్ కొడుకులు ముందు వాళ్ల పాలన సరిచేసుకోవడం మీద దృష్టి పెడితే బెటర్. ఎంతోమంది పాకిస్తాన్ ప్రజలు తిండి లేక, కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయాల్సిన పనేలేదు. పాకిస్తాన్ ప్రజలకే విరక్తి వచ్చి.. వాళ్ల ప్రభుత్వం మీద అటాక్ చేస్తరు. అసలు పాకిస్తాన్ వాళ్లకు కామన్ సెన్స్ లేదు. ఇలాంటి సమయాల్లో మనందరం ఐక్యంగా ఉండాలి’ అంటూ విజయ్ దేవరకొండ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది గమనించిన ఫ్యాన్స్.. విజయ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.






