Kingdom: అలాంటి బంధం మరొకటి లేదు.. ఎమోషనల్ టచ్‌తో వచ్చేసిన ‘కింగ్‌డమ్’ టీమ్ (పోస్టర్)

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషనల్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

Kingdom: అలాంటి బంధం మరొకటి లేదు.. ఎమోషనల్ టచ్‌తో వచ్చేసిన ‘కింగ్‌డమ్’ టీమ్ (పోస్టర్)
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఈ మూవీ జులై 31 న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం ‘కింగ్‌డమ్’ నుంచి వరుస అప్డేట్ ఇస్తూ.. సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

‘చిన్నతనంలో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన బంధం లాంటి బంధం మరొకటి లేదు.. కాలం ఆ బంధాన్ని పరీక్షించిన ఎప్పటికీ విడదీయరానిది.. కింగ్‌డమ్ సెకండ్ సింగిల్ ‘అన్నా అంటెనే’ ప్రోమో జులై 15వ తేదీ సాయంత్రం 5:05 గంటలకు రాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అన్నాదమ్ములుగా సత్యదేవ్, విజయ్ దేవరకొండ లుక్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో డ్యూటీ, జనం కోసం ఏదైనా చేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ కనిపించనుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లింక్

Next Story