- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Deverakonda: అతని ప్రతి అడుగు రాజ్యం వైపే.. విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోస్టర్‌తో ట్రైలర్ అప్డేట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జులై 31 న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు కింగ్‌డమ్ సినిమా ట్రైలర్ ఈనెల 26న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘లెక్కలేనన్ని ప్రార్థనలు ఒక వ్యక్తి ప్రయాణం!.. అతని విధి ఎలా జరుగుతుందో చూడండి.. అతని ప్రతి అడుగు రాజ్యం వైపే.. కింగ్‌డమ్ ట్రైలర్ - జులై 26న విడుదల రాబోతుంది. తిరుపతిలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది’ అంటూ రివీల్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ రక్తంతో వీర తిలకం దిద్దించుకుంటోన్న ఓ సైనికుడిలా కనిపిస్తున్నాడు. పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్న విజయ్ పోస్టర్ ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. లింక్






