- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kingdom: ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధం.. కింగ్‌డమ్ విడుదలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ (Kingdom).

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ (Kingdom). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొనగా.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘కింగ్‌డమ్’ విడుదల తేదీని ప్రకటిస్తూ.. రిలీజ్ డేట్ ప్రోమోను షేర్ చేశారు మూవీ టీమ్. ‘ఏమైనా చేస్తా సర్.. అవసరం అయితే మొత్తం తగలబెట్టేస్తా సర్’ అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్‌తో స్టార్ట్ అయినా ఈ ప్రోమోలో.. డ్యూటీ, జనం కోసం ఏదైనా చేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ కనిపించాడు.
ఇక ‘ఒక మనిషి.. కోపంతో నిండిన హృదయం.. చాలా దూరం నెట్టివేయబడిన ప్రపంచం.. ఇప్పుడు మారణహోమం సమయం స్టార్ట్.. కింగ్‌డమ్ జులై 31, 2025న సినిమా థియేటర్లలోకి రాబోతుంది’ అంటూ షేర్ చేసిన పోస్టర్‌లో విజయ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లింక్






