రౌడీ హీరో ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. కింగ్‌డమ్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

by Chukka Sudharani |   (  Updated:2025-03-27 14:28:14  IST  )

రౌడీ హీరో విజయ దేవరకొండ(Vijay Devarakonda) ప్రజెంట్ 'VD12'తో బిజీగా ఉన్నాడు.

రౌడీ హీరో ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. కింగ్‌డమ్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ దేవరకొండ(Vijay Devarakonda) ప్రజెంట్ 'VD12'తో బిజీగా ఉన్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ (Kingdom) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు చిత్ర బృందం. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే సిద్ధం అవుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆడియన్స్‌ను వైల్డ్‌గా ఆకట్టుకోగా.. తాజాగా సెకండ్ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అన్ని సరదాలు పూర్తి చేసుకుని, ప్రతిచోటా సూపర్ బ్లాక్ బస్టర్ బుకింగ్స్‌తో మేము మీ మ్యాడ్నెస్‌కి ఎక్స్‌ట్రా ఫైర్‌ను అందించబోతున్నాము. రేపటి నుండి అన్ని ‘మ్యాడ్ స్క్వేర్’ స్క్రీనింగ్‌లలో ‘కింగ్‌డమ్’ టీజర్ రాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఈ మూవీ 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధం అవుతుండగా.. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలిపారు మేకర్స్.

Next Story