NTR కోసం కింగ్‌డమ్ టైటిల్ మార్చాం: విజయ్‌ దేవరకొండ

by Gantepaka Srikanth |

చాలా ఏళ్లుగా వరుస ఫ్లాప్ మూవీలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఎట్టకేలకు సక్సెస్ సాధించారు.

NTR కోసం కింగ్‌డమ్ టైటిల్ మార్చాం: విజయ్‌ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా ఏళ్లుగా వరుస ఫ్లాప్ మూవీలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఎట్టకేలకు సక్సెస్ సాధించారు. కింగ్‌డమ్‌(Kingdom Movie)తో తన ఫ్యాన్స్‌ను సంతృప్తి పనిచాడు. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.39 కోట్లు (గ్రాస్‌) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే.. తాజాగా కింగ్‌డమ్‌పై టైటిల్‌పై విజయ్ ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. సినిమా సక్సెస్ కావడంతో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కింగ్‌డమ్ మూవీకి ముందుగా నాగ దేవర అనే టైటిల్‌ అనుకున్నామని, ఎన్టీఆర్‌(NTR) దేవర కోసం ఆ టైటిల్‌ తీసేసి.. కింగ్‌డమ్‌ ఫైనల్ చేశామని విజయ్‌ దేవరకొండ అన్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు.. తన తదుపరి సినిమాకు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారని.. ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉండబోతోందని అన్నారు.

Next Story