Vijay Deverakonda: నన్ను ఎవడైనా గెలికితే, రివర్స్ అవుతా

by velandi.Saikiran |

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్ చేశారు.

Vijay Deverakonda:  నన్ను ఎవడైనా గెలికితే, రివర్స్ అవుతా
X

దిశ‌, వెబ్ డెస్క్: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో తనను ఎవరైనా గెలికితే, మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. వాళ్లకు రివర్స్ గా తాను వ్యవహరిస్తానని హెచ్చ‌రించారు. అయితే హీరోయిన్ రష్మిక తన లాగా కాదని, చాలా క్యూట్ అంటూ ప్రశంసించారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ నిన్న జ‌రుగ‌గా స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ పాల్గొని మాట్లాడారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి కథలు ఎంచుకోవడం చాలా గొప్ప విషయమని వివరించారు.

రష్మిక జర్నీని చూస్తే చాలా గర్వంగా ఉంటుందన్నారు. నిజ జీవితంలో కూడా ఆమె భూమా దేవినే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని మాటలు అన్నా కూడా, వాటిని లెక్కచేయదని తెలిపారు. వాటిని ప‌ట్టించుకోకుండా కెరీర్ పైన దృష్టి పెట్టి ముందుకు వెళుతుందని పొగిడారు విజయ్ దేవరకొండ. ఇక ఈవెంట్ ప్రారంభాని కంటే ముందు రష్మికను చూడగానే ఆమె చేతిపై కిస్ పెట్టారు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అందుకే విజయ్ కిస్ ఇచ్చి హింట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. క్లిక్

Next Story