- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rowdy Janardhana Glimpse: ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే, వాడే ‘రౌడీ జనార్థన్’
కత్తులు పట్టుకొని, శత్రువులను నరక్కుంటూ రక్తానికి మరిగిన రౌడీలా కనిపించాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేసి, ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు మాస్, యాక్షన్ సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమానే రౌడీ జనార్ధన. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. ఈ మేరకు స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం, టైటిల్ గ్లింప్స్ వదిలింది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న రౌడీ జనార్ధన ( Rowdy Janardhana ) గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ లో కనిపించాడు. కత్తులు పట్టుకొని, శత్రువులను నరక్కుంటూ రక్తానికి మరిగిన రౌడీలా కనిపించాడు. ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే, వాడే రౌడీ జనార్ధన అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఇది ఇలా ఉండగా రౌడీ జనార్ధన సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్, విజయ్ సేతుపతి కనిపించనున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. 80వ దశకంలో తూర్పుగోదావరి నేపథ్యంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. కాగా 2026 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.






