- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay: ‘ఈ గ్రహం మీద నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’.. ఆకట్టుకుంటోన్న విజయ్ దేవరకొండ పోస్ట్
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో సైడ్ క్యారెక్టర్ పాత్రలో అవకాశాలు దక్కించుకుని.. మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా నటించి మెప్పించాడు. పెళ్లి చూపులు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే విజయ్ దేవరకొండ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తర్వాత 2017 లో ద్వారక మూవీలో చాన్స్ కొట్టేశాడు. కానీ ఈ చిత్రం ఆశించిన అంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తన నట విశ్వరూపంతో బాక్సాఫీసును షేర్ చేశాడు. ఈ మూవీతో పెద్ద స్టార్‌గా మారిపోయాడు. 2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావేలో నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.
మళ్లీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తర్వాత నోటా, టాక్సీవాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రెజెంట్ విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ మూవీలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30 తారీకున థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నేడు విజయ్ దేవరకొండ నాన్న బర్త్డే సందర్భంగా విజయ్ నెట్టింట పోస్ట్ ద్వారా విష్ చేశారు. ‘‘ఈ గ్రహం మీద నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాలు అతని చుట్టూ తిరుగుతాయి. నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న దేవరకొండ. వీరు ఒక ట్యాగ్ టీం లాంటివారు ’’ అంటూ రాసుకొచ్చాడు.






