ఆ హీరోయిన్‌ను కిస్ చేసిన విజయ్ దేవరకొండ.. అయ్యో పాపం రష్మిక అంటూ కామెంట్స్(వీడియో)

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో నటించిన సినిమా ‘లైగర్’(Liger).

ఆ హీరోయిన్‌ను కిస్ చేసిన విజయ్ దేవరకొండ.. అయ్యో పాపం రష్మిక అంటూ కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో నటించిన సినిమా ‘లైగర్’(Liger). ఇక ఇందులో యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pande) హీరోయిన్‌గా నటించింది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ప్రజెంట్ విజయ్ ‘వీడి-12’(VD-12), ‘వీడి-14’(VD-14) అనే సినిమాలతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. అయితే అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ రౌడీ హీరో నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరు కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇక వేకెషన్స్‌, బీచులు అని ఎక్కడికి వెళ్లిన ఇట్టే దొరికిపోవటం వీళ్ల స్పెషల్‌. కానీ వీరిద్దరి రిలేషన్ గురించి ఇప్పటి వరకు ఈ జంట నోరు విప్పకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో విజయ్- అనన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ విజయ్‌ని యాంకర్ కొంత మంది హీరోయిన్స్ నేమ్స్ చెబుతాను.. వాళ్ళని చూస్తే మీకు ఏ ఫుడ్ గుర్తుకు వస్తుందో చెప్పాలి అని అంటాడు. దానికి ఓకే చెప్పిన విజయ్‌కు.. ఫస్ట్ జాన్వీ(Janhvi Kapoor) ఫొటో చూపించగానే లడ్డు గుర్తుకు వస్తుందని అంటాడు.

ఆ తర్వాత సారా అలీఖాన్‌(Sara Alikhan) ఫొటోను చూపించగానే కుర్‌కురే అంటాడు. ఆ తర్వాత అనన్య అని అడగ్గానే.. పాప్సికల్స్ అని విజయ్ అంటాడు. అప్పుడు యాంకర్ ఏ ఫ్లేవర్ అనగానే వెనీల అని చెప్పి నాకెందుకో తనని చూసినప్పుడల్లా తన బుగ్గలమీద కిస్ చేయాలని అనిపిస్తుందని చెబుతాడు. ఇది విన్న అనన్య ఓకే యు కెన్ అంటుంది. వెంటనే మంచి చాన్స్ దొరికినట్టుగా రౌడీ హీరో ఆ యంగ్ బ్యూటీ చీక్స్ పై కిస్ చేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తారు. రసికుడివే అని పాపం రష్మిక అని, వదిన చూస్తే నీ పని అంతే అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story