- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Deverakonda: ఎట్టకేలకు కుంభమేళాకు చేరుకున్న విజయ్ దేవరకొండ.. కాషాయ దుస్తుల్లో ఆమెతో స్నానం చేస్తున్న ఫొటోలు వైరల్
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు సినీ సెలబ్రిటీలు తరలి వెళ్తున్నారు.

దిశ, సినిమా: ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు సినీ సెలబ్రిటీలు తరలి వెళ్తున్నారు. ఎంత అర్జెంట్ పనులు ఉన్నప్పటికీ వాయిదా వేసుకుని మరీ మహా కుంభమేళాకు వెళ్తూ అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. ఇప్పటికే సంయుక్త మీనన్(Samyuktha Menon), యాంకర్ లాస్య, బిందుమాధవి(Bindu Madhavi), శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్(Priyanka Jain) తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
అయితే ఇటీవల టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన తల్లితో కలిసి కుంభమేళాకు బయలుదేరగా ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన వెళ్లాల్సిన ఫ్లైట్ సాంకేతిక లోపం వల్ల టేకాఫ్ కాకపోవడంతో కొన్నిగంటలపాటు ఎయిర్‌పోర్ట్‌లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ విమానంలో విజయ్‌తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇక ఫ్లైట్ ఆలస్యంపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు వాగ్వాదానికి కూడా దిగారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ అష్ట కష్టాలు పడి కుంభమేళాకు చేరుకున్నారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాల ధరించి తన తల్లితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రౌడీ బాయ్ భక్తి పరవశంలో మునిగిపోయాడుగా అని అంటున్నారు.
Vijay Deverakonda takes a holy dip with mother Madhavi at Sangam during Mahakumbh in Prayagraj..#VijayDeverakonda #MahakumbhStampede #MahakumbhFire #MahaKumbhMela2025 #prayagraj pic.twitter.com/ReTbtO2Hy4
— Sushma (@sush_3006) February 9, 2025






