హార్స్ రైడింగ్ చేస్తున్న విజయ్... మరి రష్మిక ఎక్కడ అంటూ ట్రోలింగ్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-06 12:03:45  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), స్టార్ హీరోయిన్ రష్మిక ( Rashmika ) గురించి ప్రత్యేకంగా చెప్పాల

హార్స్ రైడింగ్ చేస్తున్న విజయ్... మరి రష్మిక ఎక్కడ అంటూ ట్రోలింగ్ ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), స్టార్ హీరోయిన్ రష్మిక ( Rashmika ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని... గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏ వెకేషన్ కు వెళ్లిన... ఈ ఇద్దరు.. కలిసి వెళుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అయితే రష్మిక మందన (Rashmika Mandanna ) పుట్టినరోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. నిన్న పుట్టినరోజు సందర్భంగా... బ్లాక్ డ్రెస్ వేసుకొని.. రష్మిక ఓ ఫోటో దిగింది. బర్త్డే కానుకగా చిన్న ట్రీట్ అంటూ...తన ఫోటోలు పంచుకుంది.

అయితే తనతో పాటు ఎవరూ లేరని... సింగిల్ గానే ఉన్నట్లు ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది రష్మిక. ఇక ఇవాళ హీరో విజయ్ దేవరకొండ...సరదాగ వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను పంచుకున్నాడు. ఓ బీచ్ లో హార్స్ రైడింగ్ చేస్తూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్ దేవరకొండ ఒక్కడు మాత్రమే కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజెన్స్... ఒక ఆట ఆడుకుంటున్నారు. రష్మిక ఎక్కడ..? ఆమెను కూడా చూపించు ? ఇంకా ఎన్ని రోజులు ఇలా గడుపుతారు ? అంటూ తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక్కడ విషయం ఏంటంటే... రష్మిక అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా వెకేషన్ లోనే ఉన్నారు. అలాగే వీళ్ళ ఫోటోలలో బీచ్ కామన్ గా ఉంది. కానీ.... ఇద్దరు వేరువేరుగా ఫోటోలు పంచుకున్నారు. గతంలో కూడా ఇలాగే... ఈ జంట చేసిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా కూడా.. తమ ప్రేమాయణం పై ఈ ఇద్దరు సెలబ్రిటీలు స్పందించడం లేదు. సైలెంట్ గానే ఉంటున్నారు. వాళ్లు సైలెంట్ గా ఉండటంతో... సోషల్ మీడియాలో ఈ జంట గురించి రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.

Next Story