రూమర్స్‌కు తెరదించిన విజయ్, రష్మిక.. అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం పూర్తి!

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-03 17:07:36  IST  )

టాలీవుడ్(Tollywood) సర్కిల్స్‌లో గతకొన్నాళ్లుగా హల్‌చల్ చేసిన వార్త ఎట్టకేలకు నిజమైనట్లు తెలుస్తోంది.

రూమర్స్‌కు తెరదించిన విజయ్, రష్మిక.. అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం పూర్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) సర్కిల్స్‌లో గతకొన్నాళ్లుగా హల్‌చల్ చేసిన వార్త ఎట్టకేలకు నిజమైనట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా(Rashmika Mandanna) ఒక్కటవబోతున్నట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. ఇవాళ ఉదయం అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. 2026 ఫిబ్రవరి చివర్లో ఓ ఫేమస్ డెస్టినేషన్ స్పాట్‌లో ఇద్దరి కల్యాణం జరుగనుందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్, ఛలో సినిమాతో రష్మిక తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఇద్దరూ కలిసి గీతా గోవిందం సినిమాలో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన పరిచయం స్నేహంగా మారింది. అనంతరం వారిద్దరూ డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్‌‌లో ఉన్నారని కూడా వార్తలొచ్చాయి. ఫైనల్‌గా రూమర్స్‌ అన్నింటికీ చెక్ పెట్టి.. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు విస్తృతం అయ్యాయి. దీనిపై విజయ్, రష్మిక ఇద్దరూ అఫీషియల్ అనౌన్స్ చేయాల్సి ఉంది.

Next Story