విజయ్ రష్మిక పెళ్లి.. కొత్తకోడలిని అలా పిలుస్తూ అత్త ఎమోషనల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-26 07:15:44  IST  )

విజయ్ రష్మిక సంగీత్ వేడుక జరుగుతున్న సమయంలో భావోద్వేగానికి గురైన మాధవి.. రష్మికను ఆప్యాయంగా "నా డార్లింగ్ రుషి" అంటూ పిలిచి ఆశీర్వదించింది.

విజయ్ రష్మిక పెళ్లి.. కొత్తకోడలిని అలా పిలుస్తూ అత్త ఎమోషనల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో, హీరోయిన్ విజయ్ రష్మిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఉదయం 10.10గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగ్గా సాయంత్రం 4.30గంటలకు కుటుంబ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఓ వీడియోలో రష్మికను పెళ్లికూతురులా చూసి విజయ్ దేవరకొండ తల్లి మాధవి చూసి ఎమోషనల్ అయ్యారు. సంగీత్ వేడుక జరుగుతున్న సమయంలో భావోద్వేగానికి గురైన మాధవి.. రష్మికను ఆప్యాయంగా "నా డార్లింగ్ రుషి" అంటూ పిలిచి ఆశీర్వదించింది. ఈ సన్నివేశం చూసి అతిథులు సైతం భాదోద్వేగానికి గురయ్యారు.

అలా మొదలైంది..

ఇదిలా ఉంటే రష్మిక విజయ్ దేవరకొండ మొదటిసారిగా గీతాగోవిందం అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ వె కేషన్స్ కు వెళ్లడం, ఒకే దగ్గర ఫోటో షూట్స్ చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఎప్పుడూ వీరిద్దరూ లవ్ పై క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ గానే ప్రేమ బంధాన్ని కొనసాగించారు. కానీ ఏడాది కాలంగా వీరిద్దరి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట కూడా ఇన్ డైరెక్ట్ గా మీడియాలో తమ ప్రేమ, పెళ్లిపై పాజిటివ్ గానే స్పందిస్తూ వచ్చింది. ఇక ఈ రోజు జంటగా పెళ్లి పీటలు కూడా ఎక్కేశారు.

Next Story