నా పెళ్లి అప్పుడే.. విజయ్ దేవరకొండ ప్రకటన !

by velandi.Saikiran |   (  Updated:2025-08-04 03:20:00  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే రెండు సంవత్సరాల లోనే పెళ్లి చేసుకుంటానని

నా పెళ్లి అప్పుడే.. విజయ్ దేవరకొండ ప్రకటన !
X

దిశ, వెబ్ డెస్క్ :టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే రెండు సంవత్సరాల లోనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. తొందరలోనే తన పెళ్లి జరిగే అవకాశం ఉందని కూడా విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్.

ఈ మూవీ గత వారం రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సినిమా కూడా బాగుందని అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో... థియేటర్లలో ఆక్యుపెన్సి పెరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... కొట్టేసాం అని అన్నారు కదా... మరి కట్టుకునేది ఎప్పుడు అని ఓ ఇంటర్వ్యూలో... విజయ్ దేవరకొండకు ప్రశ్న ఎదురయింది.

దీంతో విజయ్ దేవరకొండ కూడా వెంటనే సమాధానం ఇచ్చాడు. వచ్చే రెండు సంవత్సరాల లో సరైన సమయం అనిపించినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని... పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక ఇద్దరు... ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు చాలాసార్లు విదేశాల్లో ఒకే ప్లేస్ లో.. కనిపించిన ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. అంతేకాదు మొన్న కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. రష్మిక కూడా విజయ్ దేవరకొండకు కంగ్రాట్స్ చెప్పింది.

Next Story