- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: విజయ్ ఆంటోని (Vijay Antony), అరుణ్ ప్రభు (Arun Prabhu) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్మూవీ ‘భద్రకాళి’ (Bhadrakaali). విజయ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతుంది. ఇందులో వాగై చంద్రశేఖరం, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్, తృప్తి రవీంద్ర, కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
విజయ్ ఆంటోని స్వయంగా సంగీతాన్ని అందిస్తుండగా.. సెప్టెంబర్ 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘భద్రకాళి’ నుంచి ‘మారేనా’ లిరికల్ వీడియో రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘ప్రేమకు కొత్త లయ వచ్చింది.. మారేనా లిరికల్ వీడియో రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది! ప్రతీ హార్ట్ బీట్‌ను ఫీల్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. లింక్






