- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త మూవీ అనౌన్స్ చేసిన విజయ్ ఆంటోని.. ఎమోషనల్ టచ్‌తో ఆకట్టుకుంటోన్న పోస్టర్
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని నుంచి మరో ఎమోషనల్ డ్రామా రాబోతున్నది.

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని నుంచి మరో ఎమోషనల్ డ్రామా రాబోతున్నది. ము. మారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంలో ‘అప్పా కుట్టి’ గా, తెలుగులో ‘నాన్న కుట్టి’గా తెరకెక్కబోతున్నట్లు ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇక విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ ఆంటోని గాయపడిన ముఖంతో, తన కూతురిని భుజాలపై మోస్తున్నట్లుగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి విజయ్ కేవలం హీరోగానే కాకుండా, సంగీతం, ఎడిటింగ్, అండ్ నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఇందులో ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.






