- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి జరిగి వారం కాలేదు, అండర్ గ్రౌండ్ లోకి విజయ్, రష్మిక జంట !
పెళ్లి జరిగి వారం కాలేదు, అండర్ గ్రౌండ్ లోకి వెళుతున్నామని ప్రకటించింది విజయ్, రష్మిక జంట.

Vijay and Rashmika couple will go underground
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ ( vijay devarakonda ), రష్మిక మందన్న ( Rashmika Mandanna) ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన అంటే సరిగ్గా వారం కిందట ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది. ఉదయపూర్ లో ఉన్న ప్రముఖ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఒకటయ్యారు. వీళ్ళ వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఉదయపూర్ లో జరిగిన పెళ్లి వేడుకకు కొంత మంది సన్నిహితులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత గత వారం రోజులుగా ఈ జంట ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇక బుధవారం హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ ( wedding reception) కూడా జరిగింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో కేటీఆర్ దంపతులు మెరవడం గమనార్హం. అటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరోలు వచ్చారు.
అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళనున్న విజయ్, రష్మిక జంట
విజయ్ దేవరకొండ ( vijay devarakonda), రష్మిక ( Rashmika) వివాహం జరిగి దాదాపు వారం రోజులు గడిచింది. ఈ వారం రోజుల పాటు రకరకాల పెళ్లి కార్యక్రమాల నేపథ్యంలో కొత్త జంట నలిగిపోయింది. కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పెళ్లి కార్యక్రమంలో పాల్గొంది. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం... పూజా కార్యక్రమాలలో పాల్గొనడం చూసాం. అయితే బుధవారం పెళ్లి రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశారు. నేటితో పెళ్లి సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి... ఇక రష్మిక, నేను ఇద్దరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తామని ప్రకటించాడు. అండర్ గ్రౌండ్ లోనే రిలాక్స్ అవుతామని వెల్లడించాడు. దీంతో విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా 2018 సంవత్సరం నుంచే రష్మిక మందన్న, విజయ్ దేవర కొండ ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ బయటకు లీక్ కాకుండా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారని సమాచారం. 2018 సంవత్సరంలో విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్ గా గీత గోవిందం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు చెబుతున్నారు. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ సినిమాలో ఈ జంట నటించింది. త్వరలోనే రణబాలి సినిమాతో మెరువనున్నారు. ఇంతలోనే మొన్న ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక జంట పెళ్లి పీటలు ఎక్కింది. 2018 సంవత్సరం ఎవరికీ డౌట్ రాకుండా ఈ జంట, విదేశాల్లో కూడా ఎంజాయ్ చేసింది. దీనిపై అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కానీ దీనిపై విజయ్ కానీ, రష్మిక మందన్న గానీ ఎక్కడా రియాక్ట్ కాలేదు. సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. క్లిక్






