పుట్టినరోజున హీరోయిన్‌కు లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త

by Ajay Maddhiboyina |

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు విగ్నేష్ శివణ్ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని కపుల్ ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. విగ్నేష్ శివన్ బ్లూ కలర్ కారును బహుమతిగా ఇవ్వగా కారుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

పుట్టినరోజున హీరోయిన్‌కు లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త
X

దిశ‌, వెబ్ డెస్క్: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు విగ్నేష్ శివణ్ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని కపుల్ ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. విగ్నేష్ శివన్ బ్లూ కలర్ కారును బహుమతిగా ఇవ్వగా కారుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ కారు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కాగా దీని ధర కూడా ఎక్కువే. దాదాపు దీని ధర రూ.10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌గా బ్యూటిఫుల్ క‌పుల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే న‌య‌న‌తార ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం సౌత్ లో సీనియ‌ర్ హీరోయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్స్ వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సీనియ‌ర్ హీరోల‌కు ఫ‌స్ట్ ఆప్ష‌న్ గా మారింది. దీంతో చేతినిండా సినిమాల‌తో అటు త‌మిళ్ ఇటు తెలుగు, క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో బిజీగా ఉంది. మ‌రోవైపు విగ్నేష్ శివ‌న్ కూడా హీరోగా న‌టిస్తూ స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Next Story