ఆ ఇద్ద‌రు బ‌డా హీరోల‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ విజయాలతో దూసుకు వెళ్తున్న అనిల్ రావిపూడి, వచ్చే సంక్రాంతికి మరో బిగ్గెస్ట్ ప్లాన్ చేస్తున్నాడట.

ఆ ఇద్ద‌రు బ‌డా హీరోల‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ విజయాలతో దూసుకు వెళ్తున్న అనిల్ రావిపూడి, వచ్చే సంక్రాంతికి మరో బిగ్గెస్ట్ ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే సంక్రాంతికి మల్టీస్టారర్ సినిమాతో రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా కలిసి ఈ మూవీలో నటిస్తారని ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఈ మల్టీస్టారర్ మూవీ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశాడట అనిల్. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గా ఉండబోతుందా ? లేక కొత్త కథతో అనిల్ వస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక ఇప్ప‌టికే రానా, వెంకీ మామ కాంబోలో ఇప్ప‌టికే రానా నాయుడు సినిమా వ‌చ్చింది.

మన శంకర వరప్రసాద్ సినిమాతో బంపర్ హిట్

ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. 2025లో వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నాడు. ఇక మొన్నటి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. ఈ సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ దూసుకు వెళ్తోంది. 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా, నయనతార హీరోయిన్ గా నటించారు. వెంకీ మామ ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా పవన్ కళ్యాణ్ తో కూడా అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్లు నిన్నటి నుంచి న్యూస్ వైరల్ అవుతోంది.

Next Story