- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కల నెరవేరింది.. విక్టరీ వెంకటేశ్ ఆసక్తికర పోస్ట్
by Sujitha Rachapalli |
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా.. కీ రోల్ ప్లే చేస్తున్నాడు విక్టరీ వెంకటేశ్.

X
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా.. కీ రోల్ ప్లే చేస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు వెంకీ. ఈ చిత్రంలో తన పార్ట్ చిత్రీకరణ పూర్తయిందని తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. ఈ మూవీ తనకు ఇంక్రెడిబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని.. తన ఫేవరేట్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందాన్ని, నంబర్ ఆఫ్ మెమొరీస్‌ను ఇచ్చిందని తెలిపాడు. చాలా కాలం నుంచి చిరుతో నటించాలనే కోరిక ఈ సినిమాతో పూర్తయిందని.. ఇందుకు కారణమైన అనిల్ రావిపూడికి థాంక్స్ చెప్పాడు. సంక్రాంతిని థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేందుకు వెయిట్ చేస్తున్నాని చెప్పాడు వెంకీ.
Next Story






