- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఏడాదిలో ‘విచిత్రి’
సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై జ్యోతి అపూర్వ ప్రధాన పాత్రలో రవి రావణ్ రుద్ర, శ్రేయ తివారి హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘విచిత్రి’. 'బేబి' శ్రీ హర్షిణి, మీనావాసు ప్రత్యేక పాత్రలో సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. తల్లీకూతుళ్ల సెంటిమెంట్ హృదయాలను హత్తుకునే కథ, కథనంతో చక్కటి

దిశ, సినిమా : సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై జ్యోతి అపూర్వ ప్రధాన పాత్రలో రవి రావణ్ రుద్ర, శ్రేయ తివారి హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘విచిత్రి’. 'బేబి' శ్రీ హర్షిణి, మీనావాసు ప్రత్యేక పాత్రలో సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. తల్లీకూతుళ్ల సెంటిమెంట్ హృదయాలను హత్తుకునే కథ, కథనంతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘ఒక ఆత్మీయమైన తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో రూపొందిన చిత్రం ‘విచిత్ర’. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ నిజాని అంజన్ ఇచ్చిన పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ గురించి చిత్ర పాడిన సాంగ్, ఐటెమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపాడు. కాగా రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ కమెడియన్స్ అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు అద్భుతంగా నటించారు.






