- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై జయసుధ సంచలన వ్యాఖ్యలు !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
జనసేన పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా ఆయన రాణిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ పై తాజాగా సీనియర్ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ చాలా మొండి పట్టుదల ఉన్నవాడు అంటూ వ్యాఖ్యానించారు. అందుకే రాజకీయాల్లో సమర్థ్యవంతంగా ప్రజల కోసం పనిచేస్తున్నారని వివరించారు. చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, సక్సెస్ అయి చూపించారని గుర్తు చేశారు. సినిమాల్లో ఎలా దూకుడుగా ముందుకు వెళ్లారో.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుతున్నారని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా బెండ్ కాలేదన్నారు.






