- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కినేని హీరో బర్త్ డే స్పెషల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ ఫైరింగ్ పోస్టర్

దిశ, సినిమా: అక్కినేని హీరో సుమంత్(Sumanth) ‘గోదావరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మళ్లీ రావా, చిన్నోడు, సత్యం వంటి చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయిన ఆయన గత ఏడాది ‘అహం రోబోట్’ (Aham Reboot)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సుమంత్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సుమంత్, సంతోష్ జాగర్లపూడి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మహేంద్ర గిరి వారాహి’(Mahendra Giri Varahi).
తెలుగు యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి(Meenakshi Goswami) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఇందులో వెన్నెల కిషోర్(Vennela Kishore), రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, సత్య సాయి శ్రీనివాస్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్(Anup Rubens) అందించగా, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధు కలిపు, ఎం సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. నేడు వర్సటైల్ హీరో సుమంత్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ ‘మహేంద్రగిరి వారాహి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో సుమంత్ మంటల్లో ఉండగా.. ఉగ్ర రూపంలో ఎవరినో కొడుతున్నట్లు కోపంలో కనిపించారు. ప్రస్తుతం సుమంత్ ఫైరింగ్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.