బలగం వేణు.. ఎల్లమ్మ పోస్టర్ వచ్చేసింది

by velandi.Saikiran |   (  Updated:2026-01-14 12:34:33  IST  )

రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎల్లమ్మ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది.

బలగం వేణు.. ఎల్లమ్మ పోస్టర్ వచ్చేసింది
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బలగం మూవీ ఫేమ్, ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి ( venu ) కొత్త సినిమా అనౌన్స్ వచ్చేసింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్లమ్మ ( venu Yellamma ) సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఓ పాత ఇంటి గోడలపై రక్తపు మరకలతో ఎల్లమ్మ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇక రేపు ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది. కాగా ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రానుండగా హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇద్దరు హీరోయిన్లతో చర్చలు జరుగుతుండగా, ఒక హీరోయిన్ ఫైనల్ కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతలోపే సంక్రాంతి కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేందుకు వేణు సిద్ధమయ్యాడు.

న‌లుగురు హీరోలు రిజెక్ట్‌..డీఎస్పీకి ఆఫ‌ర్‌ ?

ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి ( venu ) సెకండ్ మూవీ ఎల్ల‌మ్మ సినిమా కోసం దాదాపు న‌లుగురు హీరోల‌ను సంప్ర‌దించార‌ట‌. ఇందులో నితిన్‌, శ‌ర్వానంద్, నాని, బెల్లంకొండ సాయి లాంటి హీరోల‌కు ఈ క‌థ చెప్పార‌ట‌. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా డీఎస్పీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు టాక్‌.

Next Story