ఎల్ల‌మ్మ సినిమాపై బిగ్ అప్డేట్‌..తిరుమ‌ల స‌న్నిధిలోనే !

by velandi.Saikiran |   (  Updated:2025-10-26 15:45:36  IST  )

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న వేణు, త‌న ఎల్ల‌మ్మ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ట్లు పేర్కొన్నారు. 3 వారాల్ల

ఎల్ల‌మ్మ సినిమాపై బిగ్ అప్డేట్‌..తిరుమ‌ల స‌న్నిధిలోనే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: జబర్దస్త్ వేణు... బలగం సినిమాతో స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాష, భాష ఉట్టిపడేలా బలగం సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ ఊపుతోనే ఎల్లమ్మ ప్రాజెక్టు పట్టుకొని తిరుగుతున్నాడు వేణు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నలుగురు తోపు హీరోలకు ఈ కథ చెప్పాడట. కానీ ఫైనల్ గా దేవి శ్రీ ప్రసాద్ వద్ద ఈ సినిమా ఆగినట్లు చెబుతున్నారు. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి హీరోలకు ముందుగా ఈ కథ వేణు చెప్పగా, కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్ళు సైడ్ అయిపోయారట. చివరికు దిల్ రాజు, వేణు కలిసి దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ ఎల్లమ్మ ప్రాజెక్టు దేవి శ్రీ ప్రసాద్ కూడా బాగా నచ్చినట్లు టాక్. ఇక తాజాగా ఈ సినిమాపై మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు వేణు. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న వేణు, త‌న ఎల్ల‌మ్మ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ట్లు పేర్కొన్నారు. 3 వారాల్లోనే ప‌ట్టాలెక్క‌నుంద‌ని వేణు ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.

Next Story