- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చండాలం ప్రపంచంలో ఎక్కడా ఉండదు : వేణుస్వామి
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చండాలం, అసూయలు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చండాలం, అసూయలు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. బిగ్ బాస్, డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్, తన ప్రైవేట్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను మందు తాగుతానని పబ్లిక్ గా చెప్పడం కూడా తప్పైపోతుందన్నారు. డిసెంబర్ 31 నైట్ తాగుతానని, ఆరోజు రాత్రి 11.30 గంటలకే నిద్రపోతానన్నారు. పబ్ కు వెళ్లాలని ఉన్నా.. బయటికి వెళ్తే.. తననొక కాంట్రవర్సీ పర్సన్ గా చూస్తారన్నారు. ఇటీవల పబ్బుకు వెళ్లి పెగ్గేస్తే అక్కడ తనను ఫొటోలు తీశారని, ఒకావిడ వాటిని తనకు చూపించగా.. పబ్ కు వచ్చేది భజన చేయడానికా అని ప్రశ్నించానన్నారు. అందుకే నచ్చిన ఫుడ్ తిని, తాగి పడుకుంటానని, మళ్లీ జనవరి 1నుంచి లైఫ మామూలుగానే ఉంటుందన్నారు. న్యూ ఇయర్ విషెస్ ఎవ్వరికీ చెప్పనని, ఉగాదికే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తానన్నారు.
ఈ కలియుగంలో ఒకడు ఎదుగుతున్నాడంటే.. వాడిని చూసి ఓర్వలేని వారు వందమంది ఉంటారన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత చండాలం, అసూయ ఎక్కడా ఉండవన్నారు. వీలైనంత వరకూ తనకు ప్రైవేట్ లైఫంటేనే ఇష్టమని, ఒక్కడినే ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశానికి వెళ్లినపుడు చేస్తానన్నారు. అక్కడ కూడా తెలుగువాళ్లు, ఇండియన్స్ లేని ప్రాంతాలకే వెళ్తానన్నారు. జనాలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అదే చాలా మందిని సోషల్ మీడియాలో ఫేమస్ చేస్తుందన్నారు.
ఇక బిగ్ బాస్ కు రావాలని తనకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసినట్లు వేణుస్వామి తెలిపారు. అలేఖ్య పికిల్స్, దువ్వాడ శ్రీనివాస్ లాగా.. ప్రతివారం ఎంటర్టైన్ చేయడానికి జనాలకు కొత్తవారు కావాలన్నారు. ఇదొక సైకో ప్రవృత్తి అని, జనాలు దీనికి బాగా అలవాటు పడ్డారని తెలిపారు. ప్రతీ సంవత్సరం బిగ్ బాస్ కు కంటెస్టంట్స్ ను ఇస్తున్న సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులివ్వాలన్నారు. ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేస్తే.. అదే అతన్ని సూపర్ స్టార్ ని చేస్తుందన్నారు. తనను నెలరోజులు, 10 వారాలు ఉండమన్నారని, ఎంత రెమ్యూనరేషనైనా ఇస్తామని బిగ్ బాస్ వాళ్లు అడిగారని,ఆ షోకి తాను సూటవ్వనని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు.






