- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DSPతో వేణు 8 గంటలు సిట్టింగ్..హీరోయిన్ ఫైనల్, ఎవరంటే ?
వేణు దర్శకత్వం లో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో స్పెషల్ గా హీరోయిన్ అంటూ ఎవరు ఉండబోరని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: బలగం సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు... ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్టుతో వస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న వేణు... ఎల్లమ్మ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ మేరకు దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు కొత్త దర్శకుడు వేణు. తెలంగాణ ప్రాంతంలో ఎల్లమ్మ దేవతను కొలుస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆ అమ్మవారికి చుట్టే ఈ కథ తిరగనుంది.
తెలంగాణలో పుట్టి పెరిగిన వేణు, బలగం సినిమాను చాలా సెంటిమెంట్ గా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు అదే తెలంగాణలో ప్రాముఖ్యత గాంచిన ఎల్లమ్మ ద్వారా సినిమా చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు నేపథ్యంలో తాజాగా చిన్నపాటి టీజర్ కూడా వచ్చింది. ఇందులో దేవిశ్రీప్రసాద్ మాస్ యాంగిల్ కనిపించింది. ఇందులో పర్శి అనే పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ కనిపిస్తాడట. ఎనిమిది గంటల పాటు ఈ సినిమా స్టోరీని... దేవిశ్రీప్రసాద్ కు వివరించాడట దర్శకుడు వేణు. ఆ తర్వాత ఈ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట డిఎస్పి. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరంటే ?
వేణు దర్శకత్వం లో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో స్పెషల్ గా హీరోయిన్ అంటూ ఎవరు ఉండబోరని సమాచారం. కీర్తి సురేష్ దేవతలాగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని అంటున్నారు. ఎల్లమ్మ పాత్ర ఆమె కోసమే వేణు రూపొందించాడట. ఆమె భక్తురాలిగా దేవిశ్రీప్రసాద్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ మేరకు కీర్తి సురేష్ తో కూడా చర్చలు జరుగుతున్నాయట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే అధికారిక ప్రకటన రానుంది.






