- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ellamma: సిద్ధం అవుతున్న.. త్వరలో అప్‌డేట్ రాబోతుంది అంటూ ఖతర్నాక్ ఫొటో షేర్ చేసిన బలగం వేణు
‘బలగం’ సినిమాతో డైరెక్టర్‌గా మారిపోయిన వేణు.. ఇప్పుడు తన రెండొవ చిత్రానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘బలగం’ సినిమాతో డైరెక్టర్‌గా మారిపోయిన వేణు.. ఇప్పుడు తన రెండొవ చిత్రానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అయితే.. టైటిల్‌తోనే సినిమాపై హైప్ పెరిగిపోగా.. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది, కథ ఏంటీ, నటీనటులు ఎవరు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. అంతే కాకుండా.. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని లేదా డైనమిక్ స్టార్ నితిన్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. ఇలా ఎదో ఒక న్యూస్ ఈ సినిమా గురించి వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ, మూవీ టీమ్ మాత్రం ‘ఎల్లమ్మ’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు వేణు. ‘‘ఎల్లమ్మ’ మూవీ కోసం సిద్ధం అవుతున్న.. త్వరలోనే అప్‌డేట్ వెల్లడిస్తాను’ అంటూ వేణు ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో వేణు జిమ్‌లో ఉన్నట్లు తెలుస్తుండగా ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్నట్లు బాడీ చూపిస్తూ సీరియస్‌గా ఓ లుక్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Getting ready…
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 6, 2025
Update soon..🙏#yellamma #movie pic.twitter.com/HImf3V4BhH






